ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని బిహార్‌ ముద్దుబిడ్డ: మోదీ

by Naga Rani Yarlagadda |

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తున్నారు.

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని బిహార్‌ ముద్దుబిడ్డ: మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago) దేశంలో పర్యటిస్తున్నారు. ఆ దేశానికి చేరుకున్న మోదీకి దేశ ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్ - బిస్సేర్ (kamla persad-bissessar)తో సహా 38 మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కలిసి పియార్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో (piarco international airport) స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ ప్రవాసుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా బిహార్ కు ముద్దుబిడ్డ అని పేర్కొన్నారు. ఆయన పూర్వీకులు బిహార్లోని బక్సర్ కు చెందినవారని తెలిపారు. శతాబ్దాల కాలంగా బిహార్ రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అలాగే ట్రినిడాడ్ లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్ కతా, దిల్లీ వంటి పేర్లున్నాయన్నారు.

మనదేశంలో జోధ్ పుర్ కంటే చిన్నగా ఉండే ట్రినిడాడ్ దేశంలో భారత సంతతికి చెందినవారు 40 శాతం మంది ఉన్నారు. సహకారంతో దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, నవరాత్రులు, మహాశివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం విశేషమన్నారు. కాగా.. పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కమ్లాకు మహాకుంభ్ జలంతో పాటు అయోధ్య రామమందిరం రూపాన్ని బహుకరించారు.

Next Story