Kumbh Mela: మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్న మోడీ

by Shamantha N |

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో(Kumbh Mela) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పాల్గొననున్నారు.

Kumbh Mela: మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్న మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో(Kumbh Mela) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పాల్గొననున్నారు. బుధవారం మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. ‘‘బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని (PM Modi) ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్‌ ఘాట్‌కు వెళ్తారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్‌ ఘాట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయల్దేరుతారు’’ అని పీఎంవో వివరాలు వెల్లడించింది.

మోడీ వెంట యూపీ సీఎం

గంటన్నరపాటు మోడీ ప్రయాగ్ రాజ్ లో ఉండనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే, ప్రయాగ్ రాజ్ లో ప్రధాని వెంట యూపీ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉండనున్నారు. మోడీ ప్రయాగ్ రాజ్ పర్యటనలో భాగంగా ఆయన ఇతర కార్యక్రమాల్లో పాల్గొనబోరని తెలుస్తోంది. కేవలం షాహీ స్నానాలు మాత్రమే ఆచరించనున్నట్లు సమాచారం. ఇకపోతే, 144 ఏళ్లకోసారి వచ్చే జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 35 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వచ్చారు.

Next Story