- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దయ్యింది. మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోడీ (Narendra Modi) పాల్గొనట్లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దయ్యింది. మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోడీ (Narendra Modi) పాల్గొనట్లేదు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. మే 9న నిర్వహించే విక్టరీ డే (Victory Day) పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోడీకి గతంలో రష్యా ఆహ్వానం పంపింది. ఆ వేడుకల్లో మోడీ పాల్గొనాల్సి ఉండగా.. ప్రస్తుతం అది రద్దయ్యింది. కాగా.. జనవరి 1945లో రెండో ప్రపంచయుద్ధం సమయంలో సోవియట్ సైన్యం జర్మనీపై దాడిని ప్రారంభించింది. జర్మనీ కమాండర్-ఇన్-చీఫ్ మే 9న బేషరతుగా లొంగిపోయే చట్టంపై సంతకం చేశారు. కాగా..నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే’(మే 9న)ని రష్యా నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగానే ఈసారి మిత్ర దేశాధినేతలను పుతిన్ (Vladimir Putin) ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు.
గతేడాది రష్యాలో పర్యటించిన మోడీ..
ఇక ప్రధాని మోడీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశ పర్యటన చేపట్టారు. ఉక్రయిన్ తో యుద్ధాన్ని ముగించాలని కోరడంతో.. ఆ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు, 2019లో వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు మోడీ హాజరయ్యారు. కాగా.. పర్యటన సందర్భంగా భారత్‌లో పర్యటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)ను మోడీ ఆహ్వానించారు. మోడీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినప్పటికీ.. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.






