అయోధ్య రామ మందిరంపై జెండాను ప్రతిష్ఠించనున్న ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

అయోధ్య ఆలయంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠను గుర్తుచేసే వేడుకలో భాగంగా ప్రధాని మోడీ ఆలయంపై జెండాను ప్రతిష్ఠించనున్నట్లు తెలుస్తుంది.

అయోధ్య రామ మందిరంపై జెండాను ప్రతిష్ఠించనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Temple) నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత ట్రస్ట్ నిర్వాహకులు ప్రధాని మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అయోధ్యలో భక్తులకు దర్శనం కోసం అవకాశం కల్పించారు. అయితే ఇటీవల అయోధ్య నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఆలయానికి చివరి మెరుగులు దిద్దుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలోని రామాలయం పైన జెండాను ప్రతిష్టించనున్నట్లు తెలుస్తుంది.

ఈ కార్యక్రమం అయోధ్య ఆయలయంలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ఠను గుర్తుచేసే వేడుకలో భాగంగా నిర్వహించనున్నారు. దీనిపై నవంబర్ 25న, అయోధ్యలో జరిగే కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నాయకులతో పెద్ద సమావేశం నిర్వహించనున్నారు. ఇది పార్టీ కొత్త ప్రచారానికి నాంది కానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్కౌట్ అండ్ గైడ్ జాంబోరీకి ప్రధాని పాల్గొనేవారిని ఆహ్వానిస్తారని, ఈ కార్యక్రమంలో 35,000 మందికి పైగా క్యాడెట్లు పాల్గొంటారని తెలుస్తుంది. ఈ వార్తలపై ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేకపోయినప్పటికి.. అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Next Story