- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NITI Aayog : రేపు నీతి ఆయోగ్ పాలకమండలి భేటీ.. ఎజెండా ఇదే
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శనివారం రోజు (జులై 27) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశం జరగనుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శనివారం రోజు (జులై 27) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశం జరగనుంది. ఈసారి ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో ఈ భేటీ జరగబోతోంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో ఈ థీమ్‌ను ఎంపిక చేశారు. ఈవివరాలను నీతి ఆయోగ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘వికసిత్ భారత్ @ 2047’ విజన్ డాక్యుమెంట్ అంశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై పాలక మండలి సమావేశంలో చర్చ జరుగుతుందని వెల్లడించింది. వికసిత భారత్ సాధనకు సంబంధించిన ప్రణాళికలో రాష్ట్రాలను ఎలా మమేకం చేయాలనే దానిపైనా డిస్కషన్ ఉంటుందని పేర్కొంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్ధంగా ఎలా అమలు చేయొచ్చనే దానిపై నీతి ఆయోగ్ భేటీలో చర్చించనున్నారు.
Next Story






