- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు కేంద్ర మంత్రిమండలి భేటీ
ఈ భేటీ ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఉంటుందని వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో మార్చి 3న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ భేటీ ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఉంటుందని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రోజుల ముందు ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షిస్తోంది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో అంటే 2014లో లోక్‌సభ ఎన్నికలను తొమ్మిది దశల్లో నిర్వహించగా.. మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను, మే 16న ఫలితాలను ప్రకటించింది. 2019లో ఏడు దశల్లో నిర్వహించగా.. మార్చి 10న షెడ్యూల్ ప్రకటన, మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.






