- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: పన్నుల భారం మరింత తగ్గుతుంది.. ప్రధాని నరేంద్ర మోడీ
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తెలిపారు. జీఎస్టీలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని చెప్పారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారు. జీఎస్టీలో ఇటీవలి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని, వినియోగదారుల పొదుపును పెంచుతాయన్నారు. ప్రజల మద్దతుతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతీ వస్తువును భారత్ తోనే ఉత్పత్తి చేయాలని ఆత్మ నిర్భర్ భారత్‌కు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం స్వావలంబనపై దృష్టి సారించిందని, మేడ్ ఇన్ ఇండియా కింద పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడులు పెంచాలని సూచించారు. తయారీ రంగంలో రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్లాంట్‌లో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ రక్షణ కారిడార్ ఆయుధ తయారీని పెంచుతుందని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే సంకల్పంతో భారత్ రాబోయే దశాబ్దాలకు పునాది వేస్తోందని తెలిపారు.






