- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh: మహాకుంభమేళాకు హాజరైన ప్రధాని మోడీ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో(Kumbh Mela) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పాల్గొన్నారు. మోడీ త్రివేణీ సంగమంలో బుధవారం పుణ్యస్నానం ఆచరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో(Kumbh Mela) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పాల్గొన్నారు. మోడీ త్రివేణీ సంగమంలో బుధవారం పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న మోడీ.. రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగానదికి హారతి ఇచ్చి, పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ దగ్గర విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోడీ అక్కడినుంచి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. తర్వాత త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. దానికి ముందు అక్కడి బోటులో ప్రయాణించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. ఆ సమయంలో మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
మోడీ ఔట్ ఫిట్ పై చర్చ..
మహాకుంభమేళాకు హాజరైన ప్రధాని మూడు రకాల దుస్తులు ధరించారు. ప్రస్తుతం, ఆ ఔట్ ఫిట్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఆయన దుస్తులు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. అరాలీ ఘాట్ నుంచి త్రివేణీ సంగమానికి బోట్‌లో వెళుతున్న సమయంలో మోడీ సంప్రదాయ కుర్తా, పైజామా పైన నెహ్రూ జాకెట్ ధరించారు. ఇక త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్ వేర్ ని ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు. గంగాస్నానం తర్వాత హారతి ఇచ్చే సమయంలో కుర్తా, చుడీదార్ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్ జాకెట్ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. మోడీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి భారీసఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులతో కలిపి 38 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు.






