- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అధ్యక్షుడితో 35 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ ఇరాన్ సుప్రీం కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఇరాన్ సుప్రీం.. యుద్ధం మొదలైంది.. అందరి అంతు చూస్తామని ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఇరాన్ సుప్రీం.. యుద్ధం మొదలైంది.. అందరి అంతు చూస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఫోన్‌లో సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ కాల్‌లో పలు కీలక అంశాలపై చర్చ జరిగాయని, ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని మోడీ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సంభాషణలో మోడీ, భారత్-పాక్ కాల్పుల విరమణ (India-Pakistan ceasefire) ఒప్పందం వెనుక అమెరికా పాత్ర లేదని, పాకిస్తాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే 'ఆపరేషన్ సిందూర్' నిలిపివేయబడిందని ట్రంప్‌కు ప్రధాని మోడీ క్లియర్‌గా తెలియజేశారు. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కూడా కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ విషయంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా స్పందించారు. ఇరువురి నేతల మధ్య సుమారు 35 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు ధ్రువీకరించారు. అయితే ట్రంప్, మోడీ ఫోన్ కాల్ సంభాషణలో ఉగ్రవాదంతో పాటు ఇతర ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.






