మాతృభూమికి ద్రోహం.. టీఎంసీ పతనం : ప్రధాని మోదీ

by Naga Rani Yarlagadda |

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మాతృభూమికి ద్రోహం.. టీఎంసీ పతనం : ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ రాజకీయ తీరును, గత వాగ్దానాలను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీఎంసీ పతనం మొదలైంది

సుమారు 15 ఏళ్ల క్రితం 'మాతృభూమి' సెంటిమెంటుతో, మాతృభూమి రక్షణ గురించి గొప్పగా మాట్లాడి టీఎంసీ అధికారంలోకి వచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, నేడు ఆ పార్టీ నాయకులు 'మాతృభూమి' అనే మాటను ఉచ్ఛరించడానికి కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ వారు ఆ పదాన్ని వాడితే, గత దశాబ్ద కాలంగా వారు చేసిన పాపాలు, అవినీతి బయటపడతాయని విమర్శించారు.

మాతృభూమికి టీఎంసీ ద్రోహం

టీఎంసీ అనుసరిస్తున్న క్రూరమైన విధానాలు, హింసాత్మక రాజకీయాలు సాక్షాత్తూ మాతృభూమినే ఏడిపించాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ సంస్కృతిని, అభివృద్ధిని టీఎంసీ నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కేవలం అధికార దాహంతోనే ఆ పార్టీ ముందుకు సాగుతోందని దుయ్యబట్టారు.

Next Story