- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shibu Soren : శిబూ సోరెన్ మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (Shibu Soren) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) మాజీ ముఖ్యమంత్రి అయిన శిబూ సోరెన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని తన ట్వీట్‌లో "శిబు సోరెన్ జీ ఒక అట్టడుగు స్థాయి నాయకుడు, ప్రజల పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా గిరిజన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల ఆయనకు మక్కువ ఉంది. ఆయన మృతి బాధాకరం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, అభిమానులతో నా ఆలోచనలు వారితో ఉన్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశాను" అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.






