- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ రీల్.. షేర్ చేసిన ప్రధాని మోడీ.. దేని గురించంటే?
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా షేర్ చేసిన ఒక సరదా రీల్‌పై ప్రధాని స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు సామాన్యులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ఆసక్తికర పోస్టులకు స్పందిస్తుంటారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా షేర్ చేసిన ఒక సరదా రీల్‌పై ప్రధాని స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యువరాజ్ దువా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో తన తండ్రికి తీపి పదార్థాల (Sugar) పట్ల ఉన్న ఇష్టం గురించి ప్రస్తావించారు. ‘మోడీ గారు, నాదొక చిన్న విన్నపం. మా నాన్నకు మీరంటే చాలా అభిమానం. మీరు ఏది చెప్పినా ఆయన వేదవాక్కులా వింటారు. కాబట్టి, మీ వచ్చే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో చక్కెర వాడకం తగ్గించాలని ఒక మాట చెప్పండి. అప్పుడైనా మా నాన్న తీపి తినడం తగ్గిస్తారేమో’ అని యువరాజ్ ఆ వీడియోలో సరదాగా కోరారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రధాని మోడీ స్పందన
యువరాజ్ చేసిన ఈ వీడియో ప్రధాని దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ప్రధాని మోడీ ఆ రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. యువరాజ్ తండ్రితో పాటు దేశ ప్రజలందరికీ ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ‘యువరాజ్ కోరిక మేరకు, నేను తన తండ్రిని ( ప్రతి ఒక్కరిని) చక్కెర వాడకాన్ని తగ్గించవలసిందిగా కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి’ అని పేర్కొన్నారు. మరో పోస్టులో అధిక చక్కెర వాడకం అనేక వ్యాధులకు దారితీస్తుంది, ముఖ్యంగా ఊబకాయం ముప్పు పొంచి ఉంటుంది. మీ జీవనశైలిలో యోగాను భాగం చేసుకోండి. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉంచడానికి గొప్ప మార్గం’ అని ప్రధాని సందేశమిచ్చారు. ప్రధాని మోడీ స్వయంగా స్పందించడంతో యువరాజ్ దువా ఆశ్చర్యపోయారు. ‘నా వీడియో ప్రధాని వరకు చేరుతుందని, ఆయన స్పందిస్తారని అస్సలు ఊహించలేదు’ అని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాని మోడీ రీల్ షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.
ఎవరీ యువరాజ్ దువా?
కాగా, ఢిల్లీకి చెందిన యువరాజ్ దువా (yuvraj.dua) సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్. 2023లో ఫోర్బ్స్ ప్రకటించిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో ఈయన చోటు దక్కించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈయనకు 11 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యువతకు సంబంధించిన అంశాలు, హాస్యం కలగలిసిన వీడియోలతో యువరాజ్ గుర్తింపు పొందారు.






