ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోడీ ప్రపంచ రికార్డు

by Ajay Maddhiboyina |

ఇన్ స్టాలో మోడీ ఫాలోవ‌ర్ల సంఖ్య 100 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో ప్ర‌పంచ నేత‌ల్లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగిన నేత‌గా మోడీ నిలిచారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోడీ ప్రపంచ రికార్డు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సోష‌ల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో మొద‌టి నుండి ఆయ‌న ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల‌ను సంపాదించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌పంచ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇన్ స్టాలో మోడీ ఫాలోవ‌ర్ల సంఖ్య 100 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో ప్ర‌పంచ నేత‌ల్లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగిన నేత‌గా మోడీ నిలిచారు. మోడీ 2014లో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్ర‌స్తుతం మోడీ 100 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ మార్క్ దాటి వేయ‌గా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కు కేవ‌లం 43.2 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే ఉన్నారు. అంతే కాకుండా ప్ర‌పంచంలోని ఐదుగురు ప్ర‌ముఖ అధ్య‌క్షులు, ప్ర‌ధానుల ఫాలోవర్స్ కూడా మోడీ కంటే త‌క్కువే. మ‌రోవైపు ట్విట్ట‌ర్ లోనూ మోడీ క్రేజ్ త‌క్కువేమి కాదు. ట్విట్ట‌ర్ లో మోడీకి 106.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే ట్విట్ట‌ర్ లో మోడీ కంటే ముందు ట్రంప్ ఉన్నారు. ట్విట్ట‌ర్ లోనూ వీరిద్ద‌రికీ ల‌క్ష‌ల్లో మాత్ర‌మే తేడా ఉంది.

Next Story