- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్ సమావేశంలో మంత్రులపై మోడీ సీరియస్
ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 11ఏళ్ల బీజేపీ పాలనలో చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాలని మోడీ మంత్రులకు సూచించారు. తమ తమ సొంత విజయాలను తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మోడీ మంత్రులకు క్లాస్ సైతం తీసుకున్నారు.
మంత్రులు తమ తమ శాఖలపై దృష్టి పెట్టాలని, అదే విధంగా అనవసర ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. ఇక ఈ సమావేశంలో బళ్లారి- చికజాజూరు రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ నిర్మాణంతో పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరు పోర్టుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్‌కు కనెక్టివిటీ లభిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిత్రదుర్గ, బళ్లారి, అనంతపురం మీదుగా లైన్‌ను నిర్మిస్తారు. ఈ రైల్వే లైన్ కోసం రూ.3342 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.






