- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్ జీతోనే వికసిత్ భారత్ సాధ్యం.. అది నా అపార నమ్మకం: ప్రధాని మోడీ
జెన్ జీతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని, అది తన అపార నమ్మకమని ప్రధాని మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడంలో జెన్ జీ, జెన్ ఆల్ఫా పాత్ర ఎంతో ముఖ్యమని, వారే దేశానికి వికసిత్ భారత్ లక్ష్యానికి దేశాన్ని తీసుకెళ్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మీరు జెన్ జీ, ఒకరకంగా జెన్ ఆల్ఫా. మీ తరమే దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుస్తుంది. జెన్ జీ బలం, సామర్థ్యం చూస్తే.. నాకు మీ సత్తా అర్థమవుతుంది. అందుకే మీపై నాకు అపార నమ్మకముంది’ అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా నాటి మొఘల్ సుల్తానేట్‌తో పోరాడిన ధీశాలులైన సాహిబ్‌జాదాలను గుర్తుచేసుకున్న ప్రధాని.. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న దేశం ఏదైనా సాధించగలదని ధీమా వ్యక్తంచేశారు.
అలాగే ధైర్యవంతులైన, సమర్ధవంతులైన యువతను గుర్తించే వేదికగా ‘వీర్ బాల్ దివస్’ మారిందన్నారు. డిసెంబర్ 26 ఎప్పుడొచ్చినా గురు గోబింద్ సింగ్ కుమారులైన సాహిబ్‌జాదాలను స్మరించుకుంటూ ఈ రోజు జరుపుకోవడం తనకు ఎంతో తృప్తినిస్తుందని మోడీ చెప్పారు. గత నాలుగేళ్లలో ఆ వీరుల కథలు కొత్త తరానికి కూడా చేరాయని, ఇది ధైర్యవంతులైన యువతకు వేదికగా మారిందని కొనియాడారు. వివిధ రంగాల్లో దేశం కోసం అద్భుతాలు సాధించిన పిల్లలను ప్రధాన మంత్రి నేషనల్ చిల్డ్రన్స్ అవార్డ్‌తో గౌరవించడం సంతోషంగా ఉందన్నారు.






