- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ ఇన్‌సెక్యూరిటీ వల్ల యువనేతలకు అవకాశాలు దక్కడం లేదు: మోడీ
ప్రతిపక్షంలో ప్రతిభావంతులైన యువనేతలున్నారని, కానీ రాహుల్ ఇన్‌సెక్యూరిటీ వల్ల వారికి అవకాశాలు దక్కడం లేదని ప్రధాని మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షంలో ఎంతోమంది ప్రతిభావంతమైన యువనేతలున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొందరు సత్తా ఉన్న యువనేతలకు కనీసం మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని మోడీ అన్నారు. వారిని రాహుల్ గాంధీ ఏమాత్రం ప్రోత్సహించడం లేదని, ‘ఒక కుటుంబం ఇన్‌సెక్యూరిటీ’ వల్ల ఈ యువ నేతలు గళం విప్పలేకపోతున్నారని ఆయన అన్నట్లు సమాచారం. ఇలాంటి యువనేతలు ఉండటం రాహుల్ గాంధీలో ఇన్‌సెక్యూరిటీని పెంచి, అతన్ని నెర్వస్‌గా ఫీలయ్యేలా చేస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఎన్డీయే నేతలతో టీ మీటింగ్ సమయంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారట. కేవలం ఎన్డీయే కూటమి నేతలు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో.. వర్షాకాల సమావేశాలు బాగానే జరిగాయని, కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయని పీఎం మోడీ చెప్పారట. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్ బిల్ ఆమోదం పొందడాన్ని మెచ్చుకున్న ఆయన.. భవిష్యత్తుపై ఈ బిల్లు కచ్చితంగా మంచి ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాని తెలుస్తోంది. ప్రతిపక్షాలు ప్రధానమైన బిల్లులపై చర్చించకుండా, కేవలం సభలో అల్లకల్లోలం సృష్టించడానికే ప్రయత్నించాయని విమర్శించారు.






