ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి కలిగింది.. ఎన్నికల రిజల్ట్స్‌పై స్పందించిన మోడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-08 13:44:09  IST  )

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని మోడీ అన్నారు..

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి కలిగింది.. ఎన్నికల రిజల్ట్స్‌పై స్పందించిన మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi) ప్రజలకు ఆప్(AAP) నుంచి విముక్తి లభించిందని ప్రధాని మోడీ(Pm Modi) అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన బీజేపీ(Bjp) కార్యాలయం నుంచి స్పందించారు. ఢిల్లీ వాసుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రేమను అభివృద్ధి రూపంలో చూపిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janatha Party)ని మనస్పూర్తిగా ఆశీర్వదించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. విజన్‌తో దేశరాజధానిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పారు. అవినీతి, అహంకార ఆప్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. బీజేపీ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్ముతున్నారని మోడీ తెలిపారు. పరిపాలన అంటే డ్రామాలు కాదని, ఎన్డీయే అంటే సుపారిపాలనకు నిర్వచనమన్నారు. బీహార్‌లో నితీశ్ ఎన్డీఏపై విశ్వాసం ఉంచారని మోడీ పేర్కొన్నారు.

కాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-48, ఆప్-22 గెలుచుకున్నాయి. ఎన్నికల్లో మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో అధికారం చేపట్టడంతో బీజేపీ నేతల్లో హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ఢిల్లీని మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story