- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన.. భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకొని ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకొని ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ఆయన G20 నాయకుల సదస్సు, ఐబీఎస్ఏ (ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా) సమావేశాల్లో పాల్గొన్నారు. G20 సదస్సులో మాట్లాడిన మోదీ, కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు గ్లోబల్ స్థాయిలో ఒక ఒప్పందం అవసరమని పిలుపునిచ్చారు. ఆర్థిక ప్రయోజనాల కంటే మానవ కేంద్రితమైన సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో కూడా ప్రధాని కీలక అంశాలను ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఒక ఎంపిక కాకుండా అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ వ్యవస్థలు మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. దీనికి అనుగుణంగా ఐబీఎస్ఏ ట్రోయికా స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన కోరారు.






