ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్‌లపై అమిత్ షా స్పీచ్.. ఎక్స్‌లో స్పందించిన ప్రధాని

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-29 11:22:50  IST  )

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై రెండోరోజు లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు.

ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్‌లపై అమిత్ షా స్పీచ్.. ఎక్స్‌లో స్పందించిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై రెండోరోజు లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదుల ఏరివేతలో ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయని, వాటిపై అమిత్ షా వివరణ ఇచ్చారని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు.

కాగా.. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఫైరయ్యారు. భారత్ ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడానికి, పీఓకే (POK) ఉనికికి నెహ్రూనే కారణమన్నారు. 1948లో సైనిక దళాలు పీఓకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నా నాటి ప్రధాని ఏకపక్షంగా సీజ్ ఫైర్ ప్రకటించడంతో ఆ అవకాశం చేజారిపోయిందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ సైతం ఈ చర్యల్ని వ్యతిరేకించినట్లు తెలిపారు.

Next Story