- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ట్రేడ్ డీల్ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన తయారీ, సేవలు, ఎంఎస్ఎంఈ రంగాల వల్లే భారత్ బలమైన స్థితి నుంచి చర్చలు జరిపిందని తెలిపారు. రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందని, యూపీఐ సంస్కరణలతో భారత్ డిజిటల్ నాయకత్వాన్ని సాధించిందని పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 38 అభివృద్ధి చెందిన దేశాలతో భారత దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భారతదేశంలో ఉన్న తయారీ, సేవలు, MSMEల కారణంగా బలమైన స్థానం నుండి వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపిందని తెలిపారు. ఇవాళ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ స్థిరత్వం, విధానాలపై ముందస్తు స్పష్టత పెట్టుబడిదారుల నమ్మకాన్ని భారత్‌పై తిరిగి నెలకొల్పాయని పేర్కొన్నారు. యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు లావాదేవీలు నిర్వహించే విధానంలో తీసుకొచ్చిన మౌలిక సంస్కరణల వల్లే భారత్ ప్రపంచంలో డిజిటల్ నాయకత్వాన్ని సాధించిందని చెప్పారు. విక్షిత్ భారత్‌ను రూపొందించడంలో మహిళలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మహిళల సంక్షేమమే మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. విక్షిత్ భారత్‌ను రూపొందించడంలో మహిళలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మనం పోస్ట్ ప్యాండమిక్ పరిస్థితులలో జీవిస్తున్నామని ఈ పరిస్థితులో ప్రపంచంలో భారత్ కు తలుపులు తెరుస్తున్నాయన్నారు.






