Pm modi: భూటాన్ రాజుతో ప్రధాని మోడీ భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

by B.Srinivas |

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.

Pm modi: భూటాన్ రాజుతో ప్రధాని మోడీ భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ (Jigme Khesar Wangchuck) తో ప్రధాని నరేంద్ర మోడీ (Pm modi) గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్టు తెలుస్తోంది. భూటాన్ ఆర్థికాభివృద్ధికి భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. భారత్, భూటాన్ మధ్య అద్వితీయమైన, శాశ్వత భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ‘భూటాన్ రాజు, వారి ప్రతినిధులను భారత్ స్వాగతించడం ఆనందంగా ఉంది. భూటాన్ పురోగతి, ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేస్తున్న వాంగ్‌చుక్‌ను అభినందిస్తున్నా’ అని తెలిపారు. అంతకుముందు వాంగ్ చుక్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ (Jaishanker)తో సమావేశమయ్యారు. భారత్‌-భూటాన్‌ భాగస్వామ్యం సాధిస్తున్న స్థిరమైన పురోగతిపై భూటాన్ రాజుతో చర్చించినట్టు జైశంకర్ తెలిపారు.

Next Story