PM Modi: ఘనా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు జాన్ మహామా

by B.Srinivas |

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ టూర్ ప్రారంభమైంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ బుధవారం ఆఫ్రికన్ దేశమైన ఘనా చేరుకున్నారు.

PM Modi: ఘనా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు జాన్   మహామా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) విదేశీ టూర్ ప్రారంభమైంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ బుధవారం ఆఫ్రికన్ దేశమైన ఘనా (Ghana) చేరుకున్నారు. ఆ దేశ రాజధాని అక్రలోని విమానాశ్రయంలో దిగిన మోడీకి అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహామా (Mahama) ఘన స్వాగతం పలికారు. అనంతరం గార్డ్ హాఫ్ హానర్ ఇచ్చారు. ఆ తర్వాత మోడీ బస చేసేందుకు ఓ హోటల్‌కు వెళ్లగా అక్కడి భారతీయులు ఆయనకు వెల్‌కమ్ చెప్పారు. 30 ఏళ్లలో ఓ భారత ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. అంతకుముందు 1995లో పీవీ నరసింహారావు ఘనాలో పర్యటించారు. ఈ టూర్‌లో భాగంగా మోడీ ప్రెసిడెంట్ మహామాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరగనున్నట్టు తెలుస్తోంది. తన పర్యటనకు ముందు మోడీ మాట్లాడుతూ.. ఘనా గ్లోబల్ సౌత్‌లో భారత్‌కు విలువైన భాగస్వామి అని కొనియాడారు. ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఘనా పర్యటన అనంతరం ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు.

Next Story