- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: చిలీ భారత్ కు ముఖ్యమైన భాగస్వామి- మోడీ
చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియెల్ బోరిక్(Gabriel Boric) భారత పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో(PM Modi) బోరిక్ చర్చలు జరిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియెల్ బోరిక్(Gabriel Boric) భారత పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో(PM Modi) బోరిక్ చర్చలు జరిపారు. లాటిన్ అమెరికాలో చిలీ భారత్‌కు ఓ ముఖ్యమైన భాగస్వామి అని మోడీ చెప్పుకొచ్చారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించామని..వాటిని కొనసాగించాలన్నారు. భారత్, చిలీల మధ్య ఎన్నో సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ఇతర ప్రపంచ సంస్థలలో సంస్కరణలు అవసరమని ఇరుదేశాలు భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి పిలుపునిచ్చామని తెలిపారు.
గ్యాబ్రియేల్ ఏమన్నారంటే?
మోడీతో భేటీ తర్వాత.. గాబ్రియేల్ మాట్లాడారు. భారత్ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని అన్నారు. పరస్పరం సాంస్కృతిక సహకారం అందించుకుంటామని అన్నారు. ‘షూట్ ఇన్ చిలీ’ ప్రోగ్రాం ద్వారా భారత చిత్రపరిశ్రమతో కలిసి పని చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు, ఐదు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వచ్చిన చిలీ అధ్యక్షుడు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేయనున్న విందులో చిలీ అధ్యక్షుడు పాల్గొననున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆగ్రా, ముంబై, బెంగళూరులో పర్యటించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.






