- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కీలక ప్రాజెక్టుల ప్రారంభం
ఈ నెల 29, 30 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 29, 30 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సిక్కిం (Sikkim), పశ్చిమ బెంగాల్ (West bengal), బిహార్ (Bihar), ఉత్తరప్రదేశ్ (Uthara pradesh) రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోడీ మొదటగా గురువారం సిక్కిం రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఆయన సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ‘సిక్కిం @50 వేర్ ప్రోగ్రెస్ మీట్స్ పర్పోస్ అండ్ నేచర్ గ్రోత్’ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేస్తారు. సిక్కిం ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణెం, సావనీర్ నాణెం, తపాలా బిళ్లను రిలీజ్ చేస్తారు.
అనంతరం అదే రోజు పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు. అలీవర్జీపూర్, కూచ్ బిహార్ జిల్లాల్లో జరిగే పలు ప్రోగ్రామ్స్‌కు అటెండ్ అవుతారు. సాయంత్రం బిహార్ ను సందర్శించి పాట్నా ఎయిర్ పోర్ట్ టెర్నినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 30న బిహర్‌లోని కరకట్ లో రూ. 48,520 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని పలు కార్యక్రమాలకు హాజరవుతారు. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టులోని చున్నిగంజ్ మెట్రో స్టేషన్ నుండి కాన్పూర్ సెంట్రల్ మెట్రో స్టేషన్ సెక్షన్‌ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే 31వ తేదీన మోడీ మధ్యప్రదేశ్ లోనూ పర్యటించనున్నట్టు సమాచారం.






