Pm modi: 22-23 తేదీల్లో సౌదీ అరేబియాకు ప్రధాని మోడీ.. డిఫెన్స్ సహకారంపై చర్చించే చాన్స్

by B.Srinivas |

ఈ నెల 22-23 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది.

Pm modi: 22-23 తేదీల్లో సౌదీ అరేబియాకు ప్రధాని మోడీ.. డిఫెన్స్ సహకారంపై చర్చించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22-23 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ( Mohammed bin Salman) ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు రోజుల టూర్‌లో భాగంగా మోడీ సల్మాన్ సహా ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే రక్షణ సహకారంపైనా డిస్కస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన ‘మన బహుముఖ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. అంతేగాక వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, 2016 తర్వాత ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆ దేశానికి వెళ్లారు. ఆ తర్వాత 2023లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాలో పర్యటించి జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికాలు పరోక్షంగా అణు చర్చలు జరుపుతున్నాయి. అంతేగాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story