- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi : మోడీ ఫుట్‌బాల్ కిక్ వైరల్.. సిక్కింలో ప్రధాని సందడి (ఫోటోలు)
రెండు రోజుల పర్యటన నిమిత్తం సిక్కిం వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం సిక్కిం వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు. బ్లూ స్పోర్ట్స్ జాకెట్ ధరించిన ఆయన.. బంతిని గోల్ చేసి కుర్రాళ్లతో కలిసి హై-ఫైవ్ ఇస్తూ సంబరాలు చేసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘అందమైన గ్యాంగ్‌టక్ ఉదయం వేళ నా యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఉత్సాహానిచ్చింది’ అని తెలుపుతూ ఎక్స్ (X) వేదికగా కూడా కొన్ని ఫొటోలను ప్రధాని షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ ఉల్లాసభరితమైన క్రీడా సమయం తర్వాత, సిక్కిం 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవ ముగింపు వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. రాష్ట్ర సువర్ణోత్సవాల (గోల్డెన్ జూబ్లీ) వేళ.. సిక్కిం సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా రూ.4 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, విద్య, వైద్యం, విద్యుత్, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు.. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం వేగవంతమైన, స్థిరమైన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.






