PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. ఎయిర్‌పోర్టులోనే ప్రధాని హైలెవల్ మీటింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-23 02:41:02  IST  )

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం‌లో మంగళవారం జరిగి ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 30 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు.

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. ఎయిర్‌పోర్టులోనే ప్రధాని హైలెవల్ మీటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో మంగళవారం జరిగి ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 30 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇ‌టీ) ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్’ (Resistance Front) ఈ దాడి తామే చేశామని ఇప్పటికే ప్రకటించుకుంది. 2019 పుల్వామా (Pulwama) దాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా (Saudi Arabia) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) హుటాహుటిన పర్యటను ముగించుకుని బుధవారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval), ఇతర ముఖ్య అధికారులతో పహల్గాం ఉగ్రవాద దాడిపై సమావేశమయ్యారు.

Next Story