- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: ఆపరేషన్ సిందూర్ గర్వించదగ్గ క్షణం.. సైన్యంపై మోడీ ప్రశంసలు !
భారత సాయుధ బలగాలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎటువంటి లోపం లేకుండా పక్కా ప్రణాళిక ప్రకారం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సాయుధ బలగాలపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ప్రశంసల వర్షం కురిపించారు. ఎటువంటి లోపం లేకుండా పక్కా ప్రణాళిక ప్రకారం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని కొనియాడారు. ఈ ఆపరేషన్ ఎంతో గర్వించదగ్గ క్షణమని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోడీ బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే సైన్యాన్ని ప్రశంసించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ జరిగింది. దాడుల సమయంలో ఎటువంటి పొరపాట్లు తలెత్తలేదు. ప్రతీకార దాడిని విజయవంతంగా పూర్తి చేశాం. ముందస్తుగా అంచనా వేసిన వ్యూహాల ప్రకారం సైన్యం ఉగ్రస్థావరాలపై ఎటాక్ చేసింది’ అని మోడీ మంత్రి వర్గానికి తెలియజేసినట్టు తెలిసింది. దేశం మొత్తం మన వైపు చూస్తోందని, సైన్యం పట్ల ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు.
మోడీ నాయకత్వంపై కేబినెట్ మంత్రులు సైతం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను స్వాగతించారు. ఉగ్రవాదంపై పోరాటంలో మొత్తం దేశం ప్రధాని మోడీకి, సైనిక వ్యవస్థకు దృఢంగా అండగా నిలుస్తుందని మంత్రులు తెలియజేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ వివరాలను రక్షణ మంత్రి తెలుపగానే మంత్రులందరూ హర్షం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీ ఎన్ఎస్ఏ దోవల్‌తో మాట్లాడి మారుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.






