Pm modi: ఈ నెల 29న పశ్చిమ బెంగాల్‌లో మోడీ పర్యటన.. ఎన్నికల వ్యూహాలపై డిస్కషన్

by B.Srinivas |

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని అలీపుర్జువార్ జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.

Pm modi: ఈ నెల 29న పశ్చిమ బెంగాల్‌లో మోడీ పర్యటన.. ఎన్నికల వ్యూహాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఈ నెల 29న పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని అలీపుర్దువార్ జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. 29నే సిక్కిం నుంచి అలీపుర్దువార్ చేరుకోనున్న మోడీ సభ అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలపై డిస్కస్ చేయనున్నట్టు బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. మోడీ పర్యటన అనంతరం 31వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) సైతం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన టూర్ కొనసాగనుండగా రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. దీంతో అప్రమత్తమైన బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే మోడీ, అమిత్ షాల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story