- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: దౌత్య బృందాలతో మోడీ భేటీ.. ప్రతినిధులకు అభినందనలు తెలిపిన ప్రధాని
ఆపరేషన్ సిందూర్ అనంతరం ఉగ్రవాదంపై భారత్ వైఖరి వివిధ దేశాలకు వివరించడానికి ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివిధ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వదేశానికి తిరిగొచ్చిన ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మంగళవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న పీఎం నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా బృంద సభ్యులు తమ అనుభవాలను ప్రధాని మోడీతో పంచుకున్నారు. ‘వివిధ దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధులను కలిశాను. శాంతి పట్ల భారత్ నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించారు. భారత్ స్వరాన్ని ముందుకు తెచ్చిన తీరు పట్ల మనందరం గర్విస్తున్నాం’ అని సమావేశం అనంతరం మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపేందుకే మోడీ భేటీ అయ్యారని, అధికారికంగా మరోసారి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.






