- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోడీ
by Ajay Maddhiboyina |
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను నర్మదానది ఒడ్డున ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొని ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఇక పటేల్ జయంతి సందర్భంగా మోడీ కెవడియాలో ఆయన కుటుంబ సభ్యులను సైతం కలుసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను నర్మదానది ఒడ్డున ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొని ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఇక పటేల్ జయంతి సందర్భంగా మోడీ కెవడియాలో ఆయన కుటుంబ సభ్యులను సైతం కలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. మోడీని కలిసిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనా ఉన్నారు. కాగా పటేల్ కుటుంబంతో దిగిన ఫోటోను ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కెవాడియాలో పటేల్ కుటుంబాన్ని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. వారితో సంభాషించడం ద్వారా సర్దార్ పటేల్ దేశానికి చేసిన అసాధారణ సేవలను మళ్లీ గుర్తు చేసుకున్నట్టు తెలిపారు.
Next Story






