- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: మారిషస్ చేరుకున్న ప్రధాని మోడీ.. ప్రెసిడెంట్ ధరమ్ గోఖూల్‌కు కుంభమేళ గంగాజల్
ప్రెసిడెంట్ గోఖూల్‌తో భేటీకి ముందు, ప్రధాని మోడీ మారిషస్ కౌంటర్‌లోని నవీన్‌చంద్ర రామ్‌గులంతో సమావేశమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్ చేరుకున్నారు. మంగళవారం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోఖూల్‌తో సమావేశమైన ప్రధాని మోడీ ఇటీవల ముగిసిన మహా కుంభమేళ నుంచి గంగాజల్‌ను బహుమతిగా అందజేశారు. మరికొన్ని బహుమతులు కూడా ప్రధాని మోడీ ఆయనకు ఇచ్చారు. ప్రెసిడెంట్ గోఖూల్‌తో భేటీకి ముందు, ప్రధాని మోడీ మారిషస్ కౌంటర్‌లోని నవీన్‌చంద్ర రామ్‌గులంతో సమావేశమయ్యారు. సర్ సీవూసగూర్ రామ్‌గులం బొటానికల్ గార్డెన్‌లో ఇరువురు నేతలూ ఓ మొక్కను నాటారు.
అంతకుముందు పోర్ట్ లూయిస్‌లోని విమానాశ్రయంలో భారత ప్రధాని మోడీకి మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులం ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ప్రధాని మోడీ దిగగానే ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు, రాజకీయ పార్టీలతో పాటు మతపెద్దలు కూడా హాజరయ్యారు. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ద్వీప దేశ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే సమయంలో దేశంలోని అగ్ర నాయకత్వంతో సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకతో పాటు భారత రక్షణ దళాల బృందం ఈ వేడుకల్లో పాల్గొంటుంది. భారత్ నిధులు సమకూర్చే 20కి పైగా ప్రాజెక్టులను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రధాని మోడీ మారిషస్ చేరుకున్నారు. చివరిసారిగా 2015లో మారిషస్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య నిర్మాణ, వాణిజ్య, సరిహద్దు, ఆర్థిక నేరాలను అరికట్టడం సహా వివిధ రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలపై సంతం చేయనున్నారు.






