- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi : మోడీ ఖర్గేల మధ్య నవ్వులు.. పార్లమెంట్ భవనంలో ఆసక్తికర సన్నివేశం
by Sathputhe Rajesh |
భారత ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని పురస్కరించుకుని పార్లమెంట్ భవనంలో శుక్రవారం నిర్వహించిన మహాపరిణివరణ్ కార్యక్రమంలో ఇద్దరు కీలక నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మోడీ వద్దకు ఖర్చే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఖర్గే మోడీ మాట్లాడుకుంటూ కాసేపు నవ్వుకున్నారు. ఎప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు సరదాగా గడపడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. సమానత్వం, మానవ గౌరవం కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తి అన్నారు. అంబేడ్కర్ చూపిన దార్శనికతను మనమంతా ముందుకు తీసుకెళ్లాలన్నారు.
Next Story






