- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget-2025: పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఉండాలి.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
నిరుపేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నిరుపేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ (Parliament) ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలు, సామాన్యులపై మహాలక్ష్మి (Maha Lakshmi) కృప ఉండాలని అన్నారు. మహాలక్ష్మి సిద్ధి, బుద్ధిని ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో భారతదేశ (India) శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయని తెలిపారు. ముచ్చటగా మూడో సారి ఎన్డీఏకు ప్రజలకు పట్టం కట్టారని గుర్తు చేశారు. పార్లమెంట్ (Parliament)లో సంపూర్ణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ కొత్త ప్రజల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ (Mission Mode)లో ముందుకు వెళ్తోందని అన్నారు. ఇన్నోవేషన్ (Innovation), ఇన్‌క్లూషన్ (Inclusion), ఇన్వెస్ట్‌మెంట్ (Investment) లక్ష్యంగా ఆర్థికంగా దూసుకెళ్తోందని కొనియాడారు.
బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. కొత్త విధానాలతోనే దేశ ఆర్ధిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చరిత్రాత్మక బిల్లలను ప్రవేశ పెడుతున్నామని గుర్తు చేశారు. పార్లమెంట్ (Parliament)లో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ (Union Budget) ద్వారా ప్రజలకు విశేష లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం, ప్రజల సహకారంతో సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. సమృద్ధ, వికసిత్ భారత్ (Vikasith Bharath) సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా రాబోతున్న బడ్జెట్‌లో ముఖ్యంగా యువతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఎన్డీఏ 3.0లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహరిస్తాయని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.






