PM Modi: పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ లేటెస్ట్ వార్నింగ్.. అవి మర్చిపోవాలని హితవు

by Mahesh Kanagandla |

సింధు జలాలు భారత దేశపు హక్కు అని, వాటిని మన దేశ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మన దేశం దాటి వెళ్లవని పాకిస్తాన్‌కు పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ

PM Modi: పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ లేటెస్ట్ వార్నింగ్.. అవి మర్చిపోవాలని హితవు
X

దిశ, నేషనల్ బ్యూరో: సింధు జలాలు భారత దేశపు హక్కు అని, వాటిని మన దేశ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మన దేశం దాటి వెళ్లవని పాకిస్తాన్‌కు పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నీళ్ల గురించి ఈ మధ్య మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది.. గతంలో ఈ జలాలు మన హక్కు అయినప్పటికీ దేశం దాటి వెళ్లిపోయేవి. కానీ, ఇప్పుడు నదీ జలాలు దేశ ప్రయోజనాలకే పారుతాయి. భారత ప్రయోజనాలకే వాటిని ఉపయోగిస్తాం. దేశ పురోగతి కోసం వాటిని వినియోగిస్తాం’ అని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూ.. సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపేసింది. హిమాలయాల నుంచి పారే ఈ నదీ ముఖ్యమైన ఉపనదులు పాకిస్తాన్‌కు వెళ్లుతున్నాయి. ఈ ఉపనదులే పాకిస్తాన్‌కు జీవనాడి. ఆ దేశ పంటలు ఈ జలాలపై ఆధారపడతాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయగానే పాకిస్తాన్ మండిపడింది. సింధు జలాలు దారిమళ్లిస్తే.. దాని యుద్ధ చర్యగానే చూస్తామని హెచ్చరించింది. కానీ, భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తాజాగా మోడీ స్పష్టం చేశారు.

నేడు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు?

ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు మంత్రివర్గం సమావేశం కానుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్, మరోవైపు పాక్ సరిహద్దులో భారీగా విమానాల విన్యాసాలు జరిగే రోజునే ఈ సమావేశం కావడం గమనార్హం. పహెల్గాం దాడికి దోషులకు బుద్ధిచెప్పే నిర్ణయాలు ఈ భేటీలో ఉండే అవకాశాలున్నాయి. ఈ భేటీకి ముందే నిన్న ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. 48 గంటల్లోనే ఆయన రెండోసారి సమావేశం కావడం గమనార్హం. దేశంలోని భద్రతా పరిస్థితులను ఆ సమావేశంలో సమీక్షించారు. భవిష్యత్ చర్యలపై, ప్రస్తుత పరిణామాలపై మోడీకి థోవల్ వివరించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాధిపతులతో మోడీ అనేక ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు.

Next Story