- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన అతిపెద్ద శత్రువు విదేశాలపై ఆధారపడటమే : ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి ట్రంప్ (Donald Trump) కోలుకోలేని షాకిచ్చారు. H1B వీసాల అప్లికేషన్ ఫీజును 2805 డాలర్ల నుంచి ఏకంగా లక్షడాలర్లకు పెంచుతూ చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి ట్రంప్ (Donald Trump) కోలుకోలేని షాకిచ్చారు. H1B వీసాల అప్లికేషన్ ఫీజును 2805 డాలర్ల నుంచి ఏకంగా లక్షడాలర్లకు పెంచుతూ చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఇక అమెరికా వెళ్లాలనుకున్న తమ కల చెదిరిపోయినట్లేనని భారతీయులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతుండగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మనం అభివృద్ధి చెందాలని విదేశాలపై ఆధారపడటమే అది మన పాలిట శత్రువుగా మారుతుందన్నారు. భారత్ కు ప్రధాన శత్రులు ఎవరూ లేరని, అలా ఆధారపడటమే ప్రధాన శత్రువన్నారు. ఈ శత్రువును మనం విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతూనే ఓడించాలని తెలిపారు.
మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడితే దేశ అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని హితవు పలికారు. ఎంతకాలం ఇలా విదేశాలపై ఆధారపడి బ్రతుకుతాం. మన మేథో శక్తితో సంపదను సృష్టిస్తే.. విదేశాలే మన దగ్గరకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం అక్కడికి పరుగులు పెడుతూ భావితరాలను కూడా పణంగా పెట్టలేమన్నారు. శనివారం గుజరాత్ లో పర్యటించిన ఆయన భావ్ నగర్లో రూ.34,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల్ని ప్రారంభించారు.






