Pm modi: ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలే కీలకం.. ప్రధాని మోడీ

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pm modi: ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలే కీలకం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోడీ (Pm modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌లో తయారైన స్వదేశీ ఆయుధాలు కీలకంగా పని చేశాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధాలతో సమానంగా శక్తిని ప్రదర్శించాయని నొక్కి చెప్పారు. రాబోయే కాలంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన రక్షణ పరికరాలు, ఆయుధాలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దేశ పురోగతికి నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా సాధించగలిగేలా మంత్రులు వేగంగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై వివరణాత్మకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సైనిక ఆపరేషన్‌లో పాకిస్తాన్ సైతం భారీ నష్టాలను చవిచూసిందని, స్వయంగా ఆ దేశమే దీనిని అంగీకరించిందని తెలిపారు. అలాగే తమ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఎదుర్కోవాలని కూడా మోడీ మంత్రులకు సూచించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Next Story