Pm modi: భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి.. ఘనా పార్లమెంటులో ప్రధాని మోడీ

by B.Srinivas |   (  Updated:2025-07-03 15:58:01  IST  )

మోడీ రాజనీతిజ్ఞత, ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఆయనకు ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అందజేశారు.

Pm modi: భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి.. ఘనా పార్లమెంటులో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi)కి ఘనా దేశ అత్యున్నత పురస్కారం లభించింది. మోడీ రాజనీతిజ్ఞత, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఆయనకు ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రదానం చేశారు. ఘనా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు మహామా (Mahamaa) మోడీని అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నానని తెలిపారు. రెండు దేశాల యువత ఆకాంక్షలు, ఉజ్వల భవిష్యత్, ఘనా, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలకు అవార్డును అంకితం చేస్తునట్టు తెలిపారు. అంతకుముందు మోడీ ఘనా ప్రెసిడెంట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తన పర్యటనలో భాగంగా మోడీ ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఘనా ప్రజాస్వామ్య స్పూర్తితో నిండిన దేశం ఈ దేశంలో పర్యటించడం గౌరవంగా భావిస్తు్న్నానని తెలిపారు. భారత్ సైతం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని, ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ కాదు. అది ప్రాథమిక విలువలలో ఒక భాగం అని కొనియాడారు. నిజమైన డెమొక్రసీ చర్చను ప్రోత్సహించి ప్రజలను ఏకం చేస్తుందని తెలిపారు. భారత్‌లో 2500కు పైగా పొలిటికల్ పార్టీలున్నాయని మోడీ చెప్పగా సభలో ఉన్న సభ్యులంతా కాసేపు ఆశ్చర్యపోయారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనకు

ఘనా పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోడీ ట్రినిడాడ్ టొబాగోకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. 1999 తర్వాత భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

Next Story