దేశంలో ఉన్నతంగా భారత వైవిధ్యం.. గొప్పతనం : నరేంద్ర మోడీ

by Vinod kumar |

దేశంలో వైవిధ్యం, గొప్పతనం ఉన్నతంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

దేశంలో ఉన్నతంగా భారత వైవిధ్యం.. గొప్పతనం : నరేంద్ర మోడీ
X

న్యూఢిల్లీ: దేశంలో వైవిధ్యం, గొప్పతనం ఉన్నతంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత్ తన సాంప్రదాయాన్ని హైలెట్ చేస్తుందని చెప్పారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ మార్గంలో 21వ శతాబ్దపు భారత్ పనిచేస్తుందన్నారు. గురువారం దేశరాజధానిలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 8-9 ఏళ్లలో ఆది మహోత్సవ్ లాంటి కార్యక్రమాలు దేశంలో ఉద్యమంలా మారాయని చెప్పారు.

ఆదివాసీ సమాజ సంక్షేమం తనకు వ్యక్తిగతంగా, భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ప్రదర్శనలో వారి ఉత్పత్తుల ద్వారా విభిన్న కళలు, కళాఖండాలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలను చూసి సంతోషంగా ఉందని తెలిపారు. ఆదివాసీ పిల్లలకు విద్య అందించడమనేది తమ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అని చెప్పారు. ఏకలవ్య స్కూళ్లు దానిలో భాగమని పేర్కొన్నారు. సుమారు 400కు పైగా పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివాసీ కళలను, నైపుణ్యాన్ని ఎత్తి చూపేందుకు తన ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు.

ఆదివాసీ కమ్యూనిటీ సభ్యులకు కొత్త అవకాశాలు ఇచ్చేందుకు పలు పరిశోధనా సంస్థలు కూడా దేశంలో ప్రారంభించామని చెప్పారు. అంతకుముందు వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌ను వీక్షించారు. కాగా, ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు 200లకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. 1,000 మందికి పైగా ఆదివాసీ కళాకారులు దీనిలో భాగమయ్యారు. ఈ నెల 27 వరకు ప్రదర్శన జరుగుతుంది.

Next Story