- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే రోజు ఇది అని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే రోజు ఇది అని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం చేసిన కృషికి అభినందనలు తెలిపారు. ఓటరుగా ఉండటం కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాదు దేశ భవిష్యత్ ను రూపొందించడంలో ప్రతి పౌరుడికి ఇచ్చిన విధి అని తెలిపారు. భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ణస్తారని, అదే సమయంలో భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి దేశం అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.
ప్రజాస్వామ్య విలువలు చరిత్రలో, మన సంస్కృతిలో శతాబ్దాలుగా లోతుగా పాతుకుపోయాయని చెప్పారు. 1951లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయన్నారు. 1952లో ముగిసిన ఈ ఎన్నికలు భారత ప్రజలలోని స్వాభావిక ప్రజాస్వామ్య ఆత్మను చూపించాయని చెప్పారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఇప్పుడు మొదటిసారి ఓటర్లు కావచ్చని, వారికోసం ఇది చాలా ముఖ్యమైన సమయం అని అన్నారు. మొదటిసారి వచ్చే ఓటర్లను ప్రజాస్వామ్యంలోకి స్వాగతించాలని, దేశ భవిష్యత్తును మార్చే శక్తి వారి చేతుల్లోనే ఉందని వారికి అర్థమయ్యేలా చేయాలన్నారు.






