- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi : ఐఎన్ఎస్ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
భారత నేవీ(Indian Navy) అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధనౌక(War ships)లు చేరాయి. ఐఎన్ఎస్(INS) సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధనౌకలను, ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలంతర్గామిని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించి(Started) జాతికి అంకితం(Ddedicated to the Nation)చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత నేవీ(Indian Navy) అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధనౌక(War ships)లు చేరాయి. ఐఎన్ఎస్(INS) సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధనౌకలను, ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలంతర్గామిని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించి(Started) జాతికి అంకితం(Ddedicated to the Nation)చేశారు. నూతన యుద్ధనౌకల చేరికతో భారత నౌకదళం బలం మరింత పటిష్టం కానుంది. ముంబాయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి మోడీ నూతన అత్యాధునిక యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసి మాట్లాడారు.
నౌకాదళం బలోపేతానికి నేడు మరో కీలక ముందడుగు పడిందని..తొలిసారిగా రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఒకేసారి మనం ప్రారంభించుకున్నామని.. ఇవన్నీ భారత్ లోనే తయారైనవి కావడం మనందరికి గర్వకారణమన్నారు. వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత చేకూరనుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివని..దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరని. సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, ఏడు జలాంతర్గాములు నేవీలో చేరాయని.. రక్షణరంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని మోడీ వెల్లడించారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటిందని..మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్రతీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలని ప్రధాని పిలుపునిచ్చారు.
కొత్తగా భారత నౌకదళంలో చేరిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌకను పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అ అభివృద్ధి చేసిన నాల్గవ యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం.
ఐఎన్ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టైల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక.. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు.
ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలంతర్గామి.. పీ75 కింద రూపొందిస్తున్న ఆరవదైన చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం విశేషం.






