దివ్య దేశ్‌ముఖ్‌కు ప్రధాని మోడీ అభినందనలు

by Muthe.Rajitha |

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

దివ్య దేశ్‌ముఖ్‌కు ప్రధాని మోడీ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దివ్య దేశ్‌ముఖ్‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) హర్షం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసారు. ఇద్దరు అత్యుత్తమ భారతీయ చెస్ క్రీడాకారిణులు పాల్గొన్న చారిత్రాత్మక ఫైనల్ ఇదని అన్నారు. FIDE ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ 2025గా నిలిచిన యువ దివ్య దేశ్‌ముఖ్‌ భారత్ కు గర్వకారణం అని ప్రశంసించారు.

ఈ అద్భుతమైన ఘనతనుసాధించినందుకు అభినందనలు అంటూ... ఈ విజయం చాలా మంది యువతీయువకులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కోనేరు హంపి కూడా FIDE ఛాంపియన్‌షిప్ అంతటా అపారమైన ప్రతిభను ప్రదర్శించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో వీరిద్దరూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ప్రధాని ఆకాంక్షించారు.

Next Story