- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వియత్నంలో పడవ బోల్తా.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక స్పీడ్‌బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో పడవలో ముగ్గురు సిబ్బందితో పాటు 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. హాన్ మే రట్ ఐలాండ్ నుంచి అన్ థోయ్ పోర్టుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రధాని మోడీ తీవ్ర సంతాపం..
ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ అధికారులు స్థానిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం’ అని ప్రధాని మోడీ ‘X’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.






