PM Modi: విజినజమ్ అంతర్జాతీయ ఓడరేవుని ప్రారంభించిన మోడీ

by Shamantha N |

కేర‌ళ‌లో కొత్త‌గా నిర్మించిన‌ విజినజ‌మ్ అంతర్జాతీయ ఓడరేవుని(Vizhinjam Seaport) ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆ పోర్టుని జాతికి అంకితం చేశారు. "విజినజమ్ ఓడరేవు దేశానికి, కేరళకు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది" అని ప్రారంభోత్సవం తర్వాత జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోడీ అన్నారు.

PM Modi: విజినజమ్ అంతర్జాతీయ ఓడరేవుని ప్రారంభించిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేర‌ళ‌లో కొత్త‌గా నిర్మించిన‌ విజినజ‌మ్ అంతర్జాతీయ ఓడరేవుని(Vizhinjam Seaport) ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆ పోర్టుని జాతికి అంకితం చేశారు. "విజినజమ్ ఓడరేవు దేశానికి, కేరళకు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది" అని ప్రారంభోత్సవం తర్వాత జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోడీ అన్నారు. " ఓవైపు, ఎన్నో అవకాశాలతో కూడిన సముద్రం ఉంది. మరోవైపు, ప్రకృతి సౌందర్యం ఉంది. మధ్యలో ఈ విజినజమ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ ఉంది. ఇది నవయుగ అభివృద్ధికి చిహ్నం" అని మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు.

22 డాలర్ల నష్టాన్ని పూడ్చివేయగలదు..

ప్ర‌తి ఏడాది వ‌చ్చే 22 కోట్ల డాల‌ర్ల న‌ష్టాన్ని ఈ పోర్టు పూడ్చివేయ‌గ‌ల‌ద‌ని కేరళ సీఎం విజ‌య‌న్ పేర్కొన్నారు. గ‌తంలో స‌దుపాయాలు లేక‌పోవ‌డం వ‌ల్ల 75 శాతం కంటేన‌ర్ కార్గోల‌ను విదేశాల ద్వారా మ‌ళ్లించేవాళ్ల‌మ‌ని, ఇప్పుడు ఆ స‌మ‌స్య ముగుస్తుంద‌న్నారు. ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం విజ‌య‌న్ అన్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు 2045లో ముగియాల‌ని, కానీ ద‌శాబ్ద కాలం ముందే ప్రాజెక్టు ముగిసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే 250 నౌక‌లు పోర్టుకు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇకపోతే, సుమారు రూ.8900 కోట్ల ఖ‌ర్చుతో విజినజ‌మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ డీప్‌వాట‌ర్ మ‌ల్టీప‌ర్పోజ్ సీపోర్టును నిర్మించారు. కేర‌ళ స‌ర్కారు ఈ ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) ప్రభుత్వ-ప్రైవేట్ నమూనా కింద ప్రభుత్వంతో భాగస్వామ్యంతో ఈ ఓడరేవును నిర్మించింది. డీప్-సీ పోర్టు ప్రపంచ షిప్పింగ్, వాణిజ్య మార్గాల్లో భారతదేశ ఉనికిని గణనీయంగా పెంచుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

Next Story