- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raksha Bandhan: చిన్నారులతో ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలు.. ఫోటోలు వైరల్
ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో ఘనంగా జరిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ (Raksha Bandhan) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో ఘనంగా జరిపారు. (Delhi) ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం పలువురు పాఠశాల విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు రాఖీ కట్టారు. దీంతో ప్రధాని చేయి మొత్తం రాఖీలతో నిండిపోయింది. అనంతరం మోడీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ షేర్ చేశారు. దీంతో సమాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. స్కూల్ చిన్నారులతో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోవడంపై నెటిజన్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇక, చిన్నారులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమైనది అని పీఎం మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ విషెస్ తెలియజేశారు. ట్వీట్ లింక్






