- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు PM మోడీ ఫోన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు PM మోడీ ఫోన్

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump)కు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. దాంతో పాటు ప్రపంచ పరిణామాలపైనా మాట్లాడుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్‌కు మోడీ ఫోన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఆయన్ను మోడీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ తమ కాన్వాయ్‌లను వదిలి, టయోటా ఫార్చ్యూనర్‌లో ప్రధాని అధికారిక నివాసం వరకు కలిసి ప్రయాణించడం చర్చనీయాంశమైంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోన్న భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Next Story






