- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ఒలింపిక్స్‌లో మనుభాకర్‌కు కాంస్యం.. ప్రధాని మోడీ స్పెషల్ విషెస్
పారిస్ ఒలింపిక్స్ భారత్ శుభారంభం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో మను 221.7 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళా పిస్టల్ షూటింగ్ విభాగంలో పథకం సాధించిన మొదటి మహిళగా సరికొత్త రికార్టును నెలకొల్పింది. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణ పతకం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజత పథకాలు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా షూటర్ మనుభాకర్ స్పెషల్ విషెస్ చెప్పారు. ‘పారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా దేశం తరఫున మొదటి పతకాన్ని గెలుచుకున్నారు. కాంస్య పతకాన్ని సాధించినందుకు అభినందనలు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కి ఈ విజయం మరింత ప్రత్యేకం,అపురూపమైన విజయం! అంటూ ట్వీట్ చేశారు.






