విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అవసరమా : ప్రధాని మోదీ

by velandi.Saikiran |   (  Updated:2026-05-12 06:25:50  IST  )

బంగారం కొనుగోళ్లపై కామెంట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... లేటెస్ట్ గా ఫారిన్ ట్రిక్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు.

విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అవసరమా : ప్రధాని మోదీ
X

దిశ‌, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధ భారాన్ని తగ్గించుకోవడంపైన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కు కీలక సూచనలు చేస్తున్నారు. ఆదివారం బంగారం కొనుగోళ్లపై కామెంట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... లేటెస్ట్ గా ఫారిన్ ట్రిక్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు. వోకల్ ఫర్ లోకల్ అంటూ పిలుపునిచ్చిన ఆయన.. విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు.

వీటి కారణంగా విదేశీ కరెన్సీలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. సెలవుల్లో భాగంగా పిల్లలను విదేశీ టూర్లకు పంపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాలో హాలిడే స్పాట్స్ లేవా ? విదేశాలే ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పెళ్లిలకు ఇండియాను మించిన పవిత్రమైన, అందమైన వేదిక మరొకటి లేదని వ్యాఖ్యానించారు. విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆపేయాలని కోరారు.

అటు, స్కూల్స్ కొన్నాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఛారిటీ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ కావాలని సూచనలు చేశారు. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటన సందర్భంగా మరోసారి బంగారం కొనుగోళ్ళను తగ్గించుకోవాలని.. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఐదు దేశాల పర్యటనకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..షెడ్యూల్ ఇదే

Next Story