- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ప్రధాని మోడీతో అజిత్ థోవల్ భేటీ..48 గంటల్లోనే రెండోసారి సమావేశం
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం (Pahelgam) ఉగ్రదాడి తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సైతం ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోవల్ (Ajith doval) తో మరోసారి సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ భేటీ అయ్యారు. గత 48 గంటల్లో థోవల్‌తో భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుత భద్రతా పరిస్థితులపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే భవిష్యత్ చర్యలపై, ప్రస్తుత పరిణామాలపై మోడీకి థోవల్ వివరించినట్టు సమాచారం. భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు ముందు కీలక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, గత కొన్ని రోజులుగా సైనిక చర్యలపై చర్చను వేగవంతం చేస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ (Anil chowhan), ఆర్మీ, నేవీ, వైమానిక దళాధిపతులతో మోడీ అనేక ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే నిర్ణయాన్ని సైన్యానికే వదిలేశారు. దీంతో ప్రణాళికలపై చర్చించిన ఉన్నతాధికారులు వాటిపై మోడీకి వివరణ ఇస్తున్నారు. దీంతో మోడీ తీసుకునే తదుపరి డిసిషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






