- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit shah: గుజరాత్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహించడమే ప్రధాని మోడీ టార్గెట్: కేంద్రమంత్రి అమిత్ షా
ఇక్కడ రూ. 300 కోట్లతో మ్యూజియాన్ని నిర్మించారు. క్రీడా ప్రాంగణాన్ని కూడా ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా పెట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్‌కు లేఖను సమర్పించిన నెలల తర్వాత ఆతిథ్యానికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలపై మొదటిసారి అధికారిక ప్రకటన చేశారు. మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. వాద్‌నగర్ ప్రధాని మోడీ జన్మస్థలం. వాద్‌నగర్ అత్యంత ప్రాచీన నగరాలలో ఒకటి అని మనందరికీ తెలుసు. ఈ నగరం ప్రతి యుగంలో దేశ సంస్కృతిని ప్రభావితం చేస్తోంది. ఇక్కడ రూ. 300 కోట్లతో మ్యూజియాన్ని నిర్మించారు. క్రీడా ప్రాంగణాన్ని కూడా ప్రారంభించారు. 2036 ఒలంపిక్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని, వాద్‌నగర్‌కు చెందిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఈవెంట్‌కు పంపాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు.






